Title: వీది కుక్కల కొరకు యాంటీ రాబీస్ టీకాలు ఇచ్చే “ బ్లూ (కాస్ సంస్థతో” ఒప్పందం చేయడం జరిగినది.
శనివారము రోజున గౌరవ చైర్ పర్సన్ శ్రీ సన్న శ్రీశైలం యాదవ్ గారి అధ్యక్షతన జంతు జనన నియంత్రణ మరియు వీది కుక్కల కొరకు యాంటీ రాబీస్ టీకాలు ఇచ్చే “ బ్లూ (కాస్ సంస్థతో” ఒప్పందం చేయడం జరిగినది. యాంటీ రాబీస్ టీకా మాత్రమే కుక్కలకు శా(స్తీయా, మరియు సమర్ధవంతముగా రాబీస్ వ్యాధిని నివారించగలదన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగిన కుక్కలు, కుక్కల జాతి మరియు కుక్కల సంఖ్యని తగ్గిస్తాయని, దీని వలన కుక్క కాట్లు తగ్గుతాయని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమముల యందు వైస్ చైర్-పర్సన్ శ్రీ రాత్లవాత్ గంగయ్య నాయక్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ కె.శ్రీహరి గారు, డి.ఈ.ఈ. శ్రీ బి. చిరంజీవులు గారు, బ్లూ (కాస్ సంస్థ ప్రతినిది కుమారి గారు, తదితరులు పాల్గొన్నారు.